పుట:Womeninthesmrtis026349mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

స్మృతికాలపుస్త్రీలు

మూడు ఋతుకాలములు వేచియుండి యప్పటికిని తండ్రి దానముచేయనిచో తానే స్వయముగ మఱొకనిని వివాహమాడవలెనని గౌతముడు చెప్పుచున్నాడు.

   త్రీన్కుమార్యృతూనత్యత్యస్వ యంయుజ్యే
   తానిందితేనోత్సృజ్యపిత్య్రానలంకారాన్

(గౌ.4-70)

(అవివాహిత మూడు ఋతుకాలములు వేచియుండి తండ్రిపెట్టిన యలంకారములు నాతనికిచ్చివైచి తానే యనిందితుడగు వరుని సంపాదించి వివాహమాడవలెను.)

ఇచటి మూడు ఋతుకాలములకు బదులుగ వసిష్ఠ స్మృతిలో మూడు సంవత్సరములు చెప్పబడినది.

    కుమార్యృతుమతీత్రీణి వర్షాణ్యుపాసీత
    త్రిభ్యోవర్షేభ్య: పతింవిదేత్తుల్యం

(వసి 6-67)

(ఋతుమతియైన యవివాహిత మూడు సంవత్సరములు వేచియుండి తగిన భర్తను పెండ్లాడవలెను.)

సకాలములో దానము చేయువాడు లేనిచో కన్య స్వయముగనే పెండ్లిచేసికొనవలెనని యాజ్ఞవల్క్యుడుకూడ చెప్పుచున్నాడు.

గమ్యంత్వభావే దాతౄణాం కన్యాకుర్యాత్స్వయంవరం.

(యాజ్ఞ 1-65)