పుట:Womeninthesmrtis026349mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

95

(పురుషు డే యాశ్రమమునను నుండకుండ నిలువరాదు.)

కావున వానప్రస్థు డగుట కర్హతను బొందనివాడు గృహస్థుగనే యుండవలెను. అందులకై భార్యను జేసికొన వలెను ఆతని కెవ్వరును కన్య నీయనిచో నాతని గతి యేమి కావలెనను ప్రశ్న యుదయించును. అపు డాతడు తగిన సాధనసంపత్తి యున్నను లేకున్నను గూడ నరణ్యమునకు బోవలసినదే కాని యా యపత్నీకస్థితిలో నుండ రాదు.

     అథచేన్న లేభేతాన్యాం యాచమానోపి కన్యకాం
     తమగ్నిమాత్మసాత్కృత్వాక్షి వ్రంస్యాదుత్తరాశ్రమీ
(కాత్యాయన 15)

ఒక్కొక్కపుడు పురుషుడు భార్య యున్నను మఱొక భార్యను జేసికొనవలసి వచ్చుచుండును.

    మద్యపా౽సాధు వృత్తాచ ప్రతికూలా చ యా భవేత్
    వ్యాధితావా౽ధివేత్తవ్యాహిం స్రార్థఘ్నీచ సర్వదా
    వంధ్యాష్టమే౽ధి వేద్యాబ్దే దశమేతు మృతప్రజా
    ఏకాదశే స్త్రీజననీ సద్యస్త్వ ప్రియవాదినీ
(మను9-80,81)

(మద్యపానము చేయునట్టియు, చెడునడత గలదియు, తిరస్కరించునదియు, తెగులుగొంటిదియు, భృత్యులు మున్నగు వారిని హింసించునదియు, దుర్వ్యయము చేయునదియు నగు