పుట:Womeninthesmrtis026349mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

స్మృతికాలపుస్త్రీలు

భార్య యున్నను మఱొక భార్యను చేసికొనవలెను. భార్య గొడ్రాలుగ నుండుచో నేడేండ్లు చూచి యెనిమిదవయేట మఱొక వివాహము చేసికొనవలెను. పిల్లలు చనిపోవుచున్న దానిని తొమ్మిదేండ్లును, స్త్రీ శిశువులను మాత్రమే కనుదానిని పదేండ్లును నిరీక్షించి మఱొక వివాహము చేసికొనవలెను. అప్రియములు పల్కు భార్య యుండుచో వెంటనే మఱొకతెను వివాహ మాడవలెను.)

భార్య తెగులుగొంటిదే యైనను సత్ప్రవర్తన గల్గి భర్తకు హితురాలుగ నుండుచో భర్త యామె యనుజ్ఞ నొందిననే కాని మఱొక వివాహము చేసికొనుటకు వీలులేదనియు నామె నెన్నడు నవమానము చేయరాదనియు మనువు చెప్పు చున్నాడు.

    యారోగిణీస్యాత్తు హితా సంపన్నా చైవ శీలత:
    సానుజ్ఞాప్యాధివేత్తవ్యా నావమన్యా చకర్హిచిత్
(మను 9-82)

భర్త మఱొక వివాహము చేసికొనినాడను కోపముతో నిల్లు విడచిపెట్టి పారిపోవు స్త్రీని భర్త నివారింపవలెను. లేదా యామెను పుట్టింట వదలి పెట్టవలెను.

    అధివిన్నాతుయా నారీ నిర్గచ్చేద్రోషితా గృహాత్
    సాసద్యస్సన్నిరోద్ధవ్యా త్యాజ్యా వా కులసన్నిధౌ
(మను 9-83)