పుట:Womeninthesmrtis026349mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

షష్ఠాధ్యాయము

పునర్వివాహము

గృహస్థుడు వానప్రస్థాశ్రమములో ప్రవేశించుటకు తగిన కాలము రాకపూర్వ మాతని భార్య మరణించుచో నాతడు తప్పక మఱొక భార్యను చేసికొనవలసినదే యని స్మృతులు చెప్పుచున్నవి.

     భార్యాయై పూర్వమారిణ్యైదత్వా౽గ్నీ నంత్యకర్మణి
     పునర్దా రక్రియాం కుర్యాత్పునరాధాన మేవచ.
(మను 5-168)

(తనకంటె ముందు చనిపోవు భార్య యంత్యకర్మయందగ్నులను వినియోగించి, తాను మఱల వివాహమాడి మఱల యా ధానము చేయవలెను)

పునర్వివాహమునకు హేతువు ధర్మమే యని గుర్తింప వలెను.

అనాశ్రమోనతిష్ఠేత్తుదినమే కమపిద్విజ:.

(దక్ష. 1-10)

(ద్విజుడే యాశ్రమమునను నుండకుండ నొకదినమైన నిలువరాదు.)