ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెవికీ సంస్కృతి
(వికీలో మర్యాద ముఖ్య కీలకాంశం)
వికీపీడియాలో ఎన్నో ప్రాంతాలకు చెందినవారు స్వచ్ఛందంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేరతారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. అయితే స్వయంగా ముఖ పరిచయాలు లేనప్పటికీ ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడం, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి.
- ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
- విషయంపై వాదించండి, వ్యక్తులపై కాదు.
- ప్రశ్నలను ఎదుర్కోండి, తప్పుకోకండి.
- ఇతర సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
- అవతలివారు చెప్పేది సరైనది అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
- మీరు చెప్పని విషయాలపై ప్రజలు చర్చించుకునేలా చెయ్యకండి.
- మర్యాద పాటించాలి. ఇది వికీలో గొప్ప సంప్రదాయం.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 47