ఈ పుట ఆమోదించబడ్డది
వికీడేటా
వికీడేటా అనేది వికీమీడియా ఫౌండేషన్ అందిస్తున్న డేటా ఖజానా. వికీపీడియాలో సమాచారం వ్యాసరూపంలో ఉంటుంది. భాష తెలిసిన మనుషులు దాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారు. వికీడేటాలో అదే సమాచారం డేటాంశాల రూపంలో ఉంటుంది. దాన్ని కంప్యూటర్లు కూడా చదివి అర్థం చేసుకుంటుంది. తద్వారా వికీడేటా లోని డేటాను వాడుకుని కంప్యూటరు ద్వారా అనేక రకాలైన విశ్లేషణలు చేసే వీలుంటుంది. ఇక్కడి డేటాను వివిధ భాషలలో చేరుస్తారు. తద్వారా మానవులు కూడా దీన్ని చదివే వీలుంటుంది. సెమాంటిక్ వెబ్ ను నిర్మించడంలో వికీడేటా పనికొస్తుంది.
వికీడేటాలో ఉన్న డేటా అంతా సార్వజనికంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇతర వికీమీడియా ప్రాజెక్టుల లాగానే ఇక్కడ సమాచారాన్ని ఎవరైనా చేర్చవచ్చు, ఎవరైనా స్వేచ్ఛగా ఉచితంగా వాడుకోవచ్చు.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 46