చెయ్యనక్కరలేదు. ఒకే ఫైలును వివిధ ప్రాజెక్టుల్లో వాడేటపుడు ప్రతీ ప్రాజెక్టు లోకీ ఆ ఫైలును అప్లోడు చేసే డూప్లికేషనును నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.
వికీ కామన్స్ లో ఇంకో విశిష్టత కూడా ఉంది. ప్రతి మీడియా ఫైలు పేజీ లోనూ, దానికి సంబంధించిన లైసెన్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
వికీ కామన్స్ లో విశిష్టతలకు కొదవే లేదు. అన్నిటినీ మించిన విశిష్టత ఏంటంటే.. ఇందులోని బొమ్మలను, ఇతర ఫైళ్ళనూ ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు. వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఉచితంగా వాడేసుకోవచ్చు. మూలానికి, దాన్ని ఎక్కించినవారికీ తగిన విధంగా గుర్తింపు ఇస్తే చాలు.
రండి, మీరు కూడా మీరు స్వంతంగా తీసిన ఫొటోలను ఎక్కించండి. అలాగే, మీరు ఏదైనా బొమ్మ కోసం వెతుకుతున్నారా? ... అయితే, వికీకామన్స్ లో వెతకండి. దొరికితే పూర్తి రిజల్యూషనులో ఉండే నాణ్యమైన బొమ్మలను దింపుకోండి. మీకు కావలసిన విధంగా ఉచితంగా వాడేసుకోండి.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 45