వికీమీడియా కామన్స్
వికీమీడియా కామన్స్ ను వికీకామన్స్ అనీ, కామన్స్ అనీ కూడా అనవచ్చు. లక్షలాది ఫొటోలు, ఇతర బొమ్మలు, ఆడియో వీడియో ఫైళ్ళూ ఉన్న విస్తారమైన భాండాగారం. ఇది కూడా వికీమీడియా ఫౌండేషను వారు స్థాపించిన ప్రాజెక్టే. ఈ ప్రాజెక్టు 2004 సెప్టెంబరు 7 న ప్రారంభమైంది. 2024 నవంబరు నాటికి కామన్స్ లో 11 కోట్ల పైచిలుకు ఫైళ్లున్నాయి.
వికీ కామన్స్ కు ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఫొటోలు బొమ్మలను ఎవరైనా చేర్చవచ్చు. ఫైలు నాణ్యంగా ఉంటే చాలు. వికీమీడియా కామన్స్ భాండాగారం లోని ఫైళ్లు పబ్లిక్ డొమైన్ లో కానీ, క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ కి అనుగుణంగా గానీ ఉంటే అప్ లోడు చెయ్యవచ్చు.
వికీ కామన్స్ కు మరొక విశిష్టత ఉంది. ఇక్కడి ఫైళ్ళను వికీపీడియా, వికీబుక్స్, వికీ వ్యాఖ్య, వికీసోర్స్ వంటి ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా, ఏ భాషకు చెందిన ప్రాజెక్టులోనైనా సరే నేరుగా ఉపయోగించుకోవచ్చు. వెబ్ సైటు వేరైనప్పటికీ, దాన్ని ప్రత్యేకించి ఆ ప్రాజెక్టులో మళ్లీ అప్ లోడు
వికీపీడియా గురించి మీకు తెలుసా?
44