ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వికీబుక్స్
వికీబుక్స్ అనేది వికీసోర్స్ లాంటి మరొక వికీమీడియా ప్రాజెక్టు. వికీసోర్స్ అనేది ఇదివరకే వేరేచోట్ల ప్రచురించబడిన గ్రంథాలను చేర్చే చోటు. ఎక్కడ ప్రచురించబడని గ్రంథాలను అక్కడ చేర్చరాదు. వికీబుక్స్ లో నేరుగా ప్రచురించవచ్చు. ఇక్కడీ పుస్తకాలను వాడుకరులందరూ కలిసి సమష్టిగా తయారు చేస్తారు. వికీబుక్స్ 2003 జూలై 10 న ఇంగ్లీశులో వికీబుక్స్ మొదటగా వెలుగు చూసింది. ఆంగ్లం, తెలుగుతో సహా ప్రస్తుతం 83 భాషలలో వికీబుక్స్ ప్రాజెక్టు ఉంది. తెలుగు వికీబుక్స్ ప్రస్తుతం 149 పుస్తకాలు ఉన్నాయి.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 43