Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • చర్చ మంచి వేడిగా ఉన్నపుడు, అవతలి వారు మీరు ఆశించినంత మర్యాదగా ప్రవర్తించనపుడు, మీరు వారి కంటే ఎక్కువ మర్యాదగా ఉండండి. తక్కువ మర్యాదగా కాదు. ఆ విధంగా ఘర్షణను సృష్టించిన పాపం మీకు చుట్టుకోదు. ఓ దెబ్బ తిన్నాక కూడా ఎదురుదాడి చెయ్యకుండా సంయమనంగా వ్యవహరించినట్లు చూసేవాళ్ళంతా దీన్ని హర్షిస్తారు. (కనీసం హర్షించాలి).
  • అయితే, వారు మాట్లాడే విధానం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పండి. లేకపోతే మీకు తెలియకుండానే వాళ్ళను ప్రోత్సహించినట్టవుతుంది.
  • మీది తప్పైనపుడు మన్నించమని అడిగేందుకు వెనకాడకండి. "అయ్యో అలా అనకుండా ఉండాల్సింది" అని తరువాత అనుకునే సందర్భాలు చర్చల్లో వస్తాయి. అలా అనిపించినపుడు అదేమాట చెప్పెయ్యండి.
  • మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని వాటి పట్ల పక్షపాతంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండండి.
  • అభినందించాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చా పేజీలో మీ మెప్పుదలను వ్రాయండి.
  • పరోక్ష విమర్శలు చేయవద్దు.

వికీపీడియా గురించి మీకు తెలుసా? 48