ఈ పుట అచ్చుదిద్దబడ్డది
- ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. చిత్రాలు ఇతర వీకీల నుండి తెచ్చి పెట్టవచ్చు లేదా నేరుగా విక్షనరీ లోనే ఎక్కించవచ్చు.
పదాల సేకరణ
- విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో వాడే పదాలుంటాయి.
- ప్రస్తుతం విరివిగా వాడుకలో లేని పదాలు పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి.
- జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చవచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చవచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చవచ్చు. సంస్కృతి, సంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చవచ్చు.
- వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొనవచ్చు.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 41