Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్షనరీ రూపం

● విక్షనరీలో అర్థ వివరణతో పాటు భాషా భాగాలు, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి, లింగము, నామవాచకమో, విశేషణం మొదలగునవి ఉంటాయి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం మూల రూపము దాని మార్పులు తెలుస్తాయి.
● దీనిలో నానార్థాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు, అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొనవచ్చు. పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలలో ఉన్న పదప్రయోగాలను కూడా ఇందులో చూడవచ్చు.
● ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్దాలు తెలిసిన వారు వాటిని చేర్చవచ్చు. అర్దాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్చారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ ఆయా భాషలకు లింకులు ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. ఇక మూలాలు, వనరుల వివరాలను చేర్చాలి.
● పదం గురించి తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉంటే దాని లింకు కూడా ఉంటుంది. పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.

వికీపీడియా గురించి మీకు తెలుసా?

40