Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్షనరీ

విక్షనరీ అంటే వికీ డిక్షనరీ అన్నమాట! ఇది కూడా ఒక వికీపీడియా సోదర వెబ్ సైటే. తెలుగు పదాలకు అర్ధం, వ్యాకరణ వాడుక, నానార్ధ, అంశాల వ్యతిరేకార్థాల లాంటి వివరణలను సేకరించి పెట్టిన ఉచిత నిఘంటువు. పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. కానీ విక్షనరీ మాత్రం తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర భాషా విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు కూడా లింకులుండటంవలన, ప్రపంచంలోని పలు భాషలన్నిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుంటుంది. దీనిని బహుభాషా నిఘంటువుగా పేర్కొనవచ్చు. దీనిని 2005 జులైలో ప్రారంభించారు. తెలుగు వికీపీడియాలో వలె, ఇందులో కూడా ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు. 2007 ఆగస్టు-అక్టోబరు 2007 మధ్యకాలంలో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) నేరుగా విక్షనరీలో ఇమిడ్చారు. 2024 నాటికి విక్షనరీలో లక్షా ఐదువేల పైచిలుకు పదాలు ఉన్నాయి. ఈ పదాలకు సంబంధించిన పలు అంశాల వివరణలు చేర్చాల్సి ఉంది. ఆసక్తి ఉన్న ఔత్సాహికులెవరైనా ఈ పనిలో పాల్గొనవచ్చు.


వికీపీడియా గురించి మీకు తెలుసా? 39