Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానంలో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళం, మలయాళంల తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. 2024 నవంబరు నాటికి వికీసోర్సులో 20,140 పేజీలుండగా ఇప్పటి వరకు 4,50,000 పైచిలుకు దిద్దుబాట్లు జరిగాయి.

ఇవన్నీ డిజిటైజై, దోషాలను సరిదిద్దే స్వచ్ఛంద సేవకుల కోసం ఎదురు చూస్తున్నాయి. తెలుగు తెలిసిన వారెవరైనా ఈ పని చెయ్యవచ్చు.

మీరూ చేరండి, వికీసోర్సులో పలు గ్రంథాలపై పనిచెయ్యండి. కాపీరైట్ పరిధిలో లేని ఉద్గ్రంధాలని మీరు కూడా వికీ సోర్స్ లో ఎక్కించవచ్చు.

ప్రూఫ్ రీడింగ్ వంటి కార్యక్రమాలలో తోడ్పడవచ్చు.


వికీపీడియా గురించి మీకు తెలుసా? 37