ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చివరి దశలో ఆమోదం పొందిన పేజీలు పాఠకులకు ఉచితంగా చదువుకోడానికి అందుబాటులో ఉంటాయి. చివరి మూడు దశల్లో చేసే పనిని అనేక మంది వాడుకరులు స్వచ్ఛందంగ పరస్పరం సహకరించుకుంటూ చేస్తారు.
ఎక్కడినుండి సేకరిస్తారు?
ఈ ప్రాజెక్టులో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని పుస్తకాలను లేదా లైసెన్స్ పొందిన ప్రతులను తీసుకుని ముందుగా డిజిటల్ రూపంలో వికీమీడియా కామన్స్ ప్రాజెక్టు లోకి ఎక్కిస్తారు. ఒకవేళ పుస్తకంపై కాపీహక్కులు ఉంటే, సదరు హక్కుదారుల నుండి పూర్తి స్వేచ్ఛా ధృవీకరణ పత్రం తీసుకుని పుస్తకాలను ఎక్కిస్తారు. పై రెంటికీ చెందిన పుస్తకాలను వికీసోర్సు లోకి తీసుకోరు. కింది రకాల పుస్తకాలను వికీసోర్సు లోకి తీసుకుంటారు.
- ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు. [అముద్రిత్య గ్రంథాలను ఇక్కడ తీసుకోరు]
- అసలు గ్రంథాల అనువాదాలు
- జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
- వికీసోర్స్ లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
- ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
కింది లక్షణాలున్న గ్రంథాలను వీకీసోర్సు లోకి స్వీకరించరు
- కాపీహక్కులకు లోబడీ ఉన్న పుస్తకాలు
- గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
- కంప్యూటరు సాఫ్టువేరుకు సంబంధించిన సోర్స్ కోడ్
- గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
వికీపీడియా గురించి మీకు తెలుసా? 35