Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టుకోవచ్చు. మామూలుగా డిజిటల్ రూపంలో ఉన్న పుస్తకాల్లో అలా వెతికే వీలు ఉండదు.

వికీసోర్స్ ప్రాజెక్టు అధికారికంగా 2003 నవంబరు 24 న 'ప్రాజెక్టు సోర్స్బర్గ్' పేరుతో ప్రారంభమైంది. దాని మొదటి లోగో 'మంచుకొండ (iceberg)' చిత్రం. 2003 డిసెంబరు 6 న ఈ ప్రాజెక్టుపేరును వికీసోర్స్ గా మార్చారు. 2004 జూలై 23 న 2004న ప్రాజెక్టుకు స్వంత, శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) సమకూరింది. ప్రస్తుతం వికీసోర్స్ తెలుగుతో పాటు 75 పైచిలుకు భాషలలో ప్రచురితమౌతోంది.

విషయ సూచిక, ట్రాన్స్క్రిప్షను, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్మూషన్ వంటివి ఈ ఉపకరణాల్లో ప్రధానమైనవి. వికీసోర్సులో పని కింది దశల్లో జరుగుతుంది.

1. ముద్రిత రూపంలో ఉన్న మూల గ్రంథాన్ని స్కాను చేసి డిజిటలురూపానికి మార్చడం

2. స్కాను చేసిన పేజీలను ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ పద్ధతిలో పాఠ్యం రూపంలోకి మార్చడం

3. స్కాను పేజీని, ఈ పాఠ్యం రూపంలో ఉన్న పేజీని పక్కపక్కనే పెట్టి వాడుకరులకు చూపించడం.

4. స్కాను రూపం లోని మూలాన్ని చదువుతూ పాఠ్య రూపంలో దోషాలేమైనా ఉంటే సవరించడం (టైపింగు)

5. పై దశలో టైపించిన పేజీని మరొక వాడుకరి చదివి ఇంకా దోషాలేమైనా ఉంటే సవరించడం (ప్రూఫ్ రీడింగు)

6. ప్రూఫ్ రీడింగైన పేజీని అంతిమంగా పరిశీలించి ప్రచురణకు ఆమోదించడం (ఆమోదం)


వికీపీడియా గురించి మీకు తెలుసా? 34