ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఈ వెబ్సైట్లను హోస్టింగు చెయ్యడం, సాంకేతిక నిర్వహణ చెయ్యడం, సాఫ్టువేరును మెరుగుపరచడం వంటివి మాత్రమే ఫౌండేషను బాధ్యత.
ఈ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తుంది. ఫౌండేషను నిర్వహించే ఏ వెబ్సైట్లలోనూ వ్యాపార ప్రకటనలుండవు. మీడియావికీ సాఫ్టువేరుతో సహా ఫౌండేషను అభివృద్ధి చేసి నిర్వహించే ఉత్పత్తులు సేవలూ అన్నీ ఉచితమే, సార్వజనీనమే, ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఎంత స్వేచ్ఛ అంటే, వికీపీడియా లోని సమాచారాన్ని ఉచితంగా డౌన్లోడు చేసుకుని వాటిని పుస్తకాలుగా ముద్రించి అమ్ముకోవచ్చు. ఈ సమాచారాన్ని వికీపీడియా నుండి సేకరించామని వెల్లడిస్తే చాలు. విరాళాల ద్వారా అందే సొమ్ము నుండి కొంత భాగాన్ని వివిధ ప్రాజెక్టుల్లో వాడుకరులు చేపట్టదలచిన ప్రత్యేక ప్రాజెక్టులు, సమావేశాలు, గోష్ఠులు, వగైరాల కోసం గ్రాంటులుగా అందిస్తుంది.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 30