Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫౌండేషను స్థాపించిన వికీ

ప్రాజెక్టులు

మీడియావికీ సాఫ్టువేరును అభివృద్ధి చెయ్యడంతో పాటు, ఆ సాఫ్టువేరు పునాదులపై అనేక విజ్ఞానసర్వస్వ వెబ్సైట్లను కూడా ఫౌండేషను నిర్వహిస్తోంది. వీటిలో వికీపీడియా మొదటిది, అత్యంత ప్రసిద్ధి పొందినదీ, అత్యంత ప్రజాదరణ పొందినదీను. ఇది 352 భాషలలో 6 కోట్ల పైచిలుకు వ్యాసాలతో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన అన్ని రకాల వెబ్సైట్లలో 7 వ స్థానంలో ఉంది. ఈ వికీపీడియాల్లో తెలుగు వికీపీడియా లక్షకు పైగా వ్యాసాలతో 72 వ స్థానంలో, భారతీయ భాషా వికీపీడియాల్లో 5 వ స్థానంలో ఉంది. వికీపీడియాతో పాటు, వికీసోర్సు, వికీకోట్, విక్షనరీ, వికీవాయేజ్, వికీవార్సిటీ, వికీబుక్స్, వికీడేటా, వికీకామన్స్ వంటి అనేక ఇతర వెబ్సైట్లను కూడా నిర్వహిస్తోంది.

ఫౌండేషను నిర్వహించే వెబ్సైట్లలో నెలకు 2300 కోట్ల పేజీవ్యూలు ఉంటాయి. ఒక్క భారతదేశం లోనే నెలకు అన్ని రకాల వికీలకూ కలిపి 70 కోట్ల పేజీవ్యూలు ఉంటాయి. ఒక్క తెలుగు వికీపీడియాలో నెలకు కోటీ 30 లక్షల పేజీవ్యూలుంటాయి.


వికీపీడియా గురించి మీకు తెలుసా? 29