మీడియావికీ సాఫ్టువేరు
ఫౌండేషను కార్యకలాపాల్లో మీడియావికీ సాఫ్టువేరు అభివృద్ధి ఒక ప్రధానమైన అంగం. ఈ సాఫ్టువేరును ఎవరైనా ఉచితంగా డౌన్లోడు చేసుకుని వాడుకోవచ్చు. పాఠకులే రచయితలై కలిసిమెలిసి (కొలాబొరేషను పద్ధతిలో) కంటెంట్ మేనేజిమెంట్ వెబ్సైట్లను అభివృద్ధి చేసుకోవడం ఈ సాఫ్టువేరు ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ సాఫ్టువేరు ద్వారా తమ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సాఫ్టువేరు ద్వారా అందిస్తున్నారు. తెలుగుతో సహా 400 కు పైగా భాషల్లో ఈ సాఫ్టువేరు అందుబాటులో ఉంది. నేరుగా అనేక లక్షల వెబ్సైట్లు ఈ సాఫ్టువేరుపై ఆధారపడి ఉండగా, వెబ్సైట్లను హోస్టు చేసే వివిధ హోస్టింగు సైట్లు కూడా ఈ సాఫ్టువేరును స్థాపించుకుని వాటిపై 75 వేల వెబ్సైట్లను హోస్టు చేస్తున్నాయి. వీటిలో ఫౌండేషను స్వయంగా నిర్వహిస్తున్న 900 సైట్లు కూడా భాగం. ఈ సైట్లలో 125 కోట్ల పేజీలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. 120 కోట్ల వాడుకరులు నమోదై ఉన్నారు. 43 లక్షల మందికి పైగా రోజూ ఈ సైట్లలో సమాచారం చేరుస్తూంటారు. 20 కోట్లకు పైగా ఫొటోలు, చిత్రాలు, ఇతర ఫైళ్ళూ ఉన్నాయి.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 28