వికీమీడియా ఫౌండేషన్
2003 జూన్ లో అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ప్రపంచం నలుమూలల నుండి సేకరించే విరాళాల ద్వారా ఈ సంస్థ పనిచేస్తుంది. విశ్వం లోని విజ్ఞానాన్ని ప్రపంచం లోని ప్రజలందరికీ స్వేచ్ఛగా, ఉచితంగా అందుబాటులోకి తేవడం దాని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పలు విజ్ఞాన సర్వస్వ ప్రాజెక్టులను నెలకొల్పింది. ఈ ప్రాజెక్టులను నడిపేందుకు మీడియావికీ అనే సాఫ్టువేరును అభివృద్ధి చేసి, దాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఫౌండేషను, ఈ సాఫ్టువేరును నిరంతరం మెరుగుపరుస్తూ, కొత్త కొత్త అంశాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ సాఫ్టువేరును ఉచితంగా డౌన్లోడు చేసుకుని ఎవరైనా తమ స్వంత వికీ వెబ్సైటును నెలకొల్పుకోవచ్చు. వికీమీడియా ఫౌండేషను ఈ సాఫ్టువేరును అభివృద్ధి చెయ్యడమే కాకుండా, దాని ఆధారంగా పలు విజ్ఞానసర్వస్వ ప్రాజెక్టులను నిర్మించింది. వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ, వికీకామన్స్, వికీడేటా వంటి పలు ప్రాజెక్టులను ఈ సాఫ్టువేరు ఆధారంగా నిర్మించింది. ఈ ప్రాజెక్టులను వందలాది భాషలలో స్థాపించి, నిర్వహిస్తూ వాటి పురోగతికి కృషిచేస్తోంది.
వికీపీడియా గురించి మీకు తెలుసా?
27