Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • మూలంలో ఉన్న వర్గాలు ఆటోమాటిగ్గా అనువాదం లోకి వచ్చేస్తాయి.
  • మూలంలో ఉన్న పట్టికలు అనువాదం లోకి వచ్చేస్తాయి, పట్టిక లోని సమాచారం కూడా అనువాదమౌతుంది.

అయితే ఈ యాంత్రికానువాదం అసహజంగా ఉంటుంది. "మరియు”, "యొక్క" లాంటి కృతక పదాలను చేర్చుతుంది. కర్మణి వాక్యాలను విరివిగా రాస్తుంది. వీటిని సవరించి భాషను సహజంగా ఉండేలా తీర్చిదిద్దాకనే ప్రచురించాలి. అయితే ఆ అనువాదాన్ని సవరించడం తేలిగ్గానే అయిపోతుంది.

ఇంతకీ మేం చెప్పొచ్చేది ఏంటంటే..

  • నేటి సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేద్దామని మీరు అనుకుంటే
  • తెలుగు భాషలో విజ్ఞానాన్ని అందించేందుకు తోడ్పడదలిస్తే
  • రాబోయే తరాల తెలుగుబిడ్డల కోసం ఒక విష్ణుశర్మ అవ్వాలనుకుంటే
  • దశాబ్దాల పాటు పాఠాలు చెప్పి, వేలాది మంది పిల్లలను తీర్చిదిద్దిన మీ మేథను, మీ శక్తియుక్తులను లక్షల మంది కోసం వినియోగించదలిస్తే
  • తెలుగు విజ్ఞాన భూమిలో ఒక మొక్క నాటడం కాదు, ఒక అడవినే పెంచాలని అనుకుంటే

మీరు తెలుగు వికీపీడియాలో రాయాల్సిందే. తెలుగు వికీపీడియాలో మీ అవసరం చాలానే ఉంది. రండి!

వికీపీడియా గురించి మీకు తెలుసా? 25