Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికీపీడియాలో వ్యాసం పేజీకి ఒక నిర్దుష్టమైన రూపం ఉంటుంది. వ్యాసానికి పైన కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. వీటిలో వ్యాసానికి సంబంధించిన చర్చ పేజీ, వ్యాస చరిత్ర వగైరా లింకులు ఉంటాయి. వ్యాసానికి అడుగున ఆ వ్యాస విషయానికి చెందిన వర్గాలు ఉంటాయి. వ్యాసానికి ఇరువైపులా వికీపీడియా సాధారణ లింకులు ఉంటాయి. వ్యాసం దేహంలో సమాచారం వివిధ విభాగాలుగా విభజించి ఉంటుంది. వ్యాసం లోని సమాచారాన్ని స్థూలంగా చూపుతూ ఒక పెట్టె ఉంటుంది. వ్యాసానికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి.

వ్యాసం చర్చాపేజీ

వ్యాసానికి సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వాడుకరులు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. ప్రతీ వ్యాసానికీ ఒక చర్చా పేజీ ఉంటుంది. వాసంలో రాసే సమాచారం గురించి వాడుకరులు ఇక్కడ చర్చించుకుని తదనుగుణంగా సమాచారాన్ని మెరుగుపరుస్తూంటారు.

సవరించు

వ్యాసంలో మార్పుచేర్పులు చేసేందుకు ఈ లింకును వాడతారు. ఈ లింకును నొక్కితే వ్యాసంలో మార్పుచేర్పులు చేసేందుకు వీలుకల్పించే ఒక ఎడిటరు తెరుచుకుంటుంది. రకరకాల పద్ధతుల్లో తెలుగును రాయగలిగే వీలు ఈ ఎడిటరులో ఉంది. తెలుగు టైపింగు రానివారు కూడా ఇక్కడ ఇట్టే టైపు చెయ్యవచ్చు. అసలు తెలుగు రాని పరాయి భాషల వ్యక్తులు కూడా తెలుగులో రాయవచ్చు (కాకపోతే తాము ఏమి రాస్తున్నామో వారికి తెలియదనుకోండి). అంత సులువైన ఎడిటరు ఇది.

చరిత్ర

వ్యాసం మొదలుపెట్టినప్పటి నుండీ, అందులో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు,

వికీపీడియా గురించి మీకు తెలుసా? 20