Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమేం మార్పుచేర్పులు చేసారో పూసగుచ్చినట్లు చూపించే పేజీ ఇది. ప్రతీ వ్యాసానికీ ఒక చరిత్ర పేజీ ఉంటుంది.

మూలాలు (రిఫరెన్స్ లు)

వికీపీడియాలో రాసిన సమాచారాన్ని ధ్రువీకరించేందుకు ఆ సమాచారాన్ని ఎక్కడి నుండీ సేకరించారో దాని వివరాలను చేరుస్తారు. వికీపీడియాలో ఇది తప్పనిసరైన అంశం. ఈ ఉల్లేఖనలను మూలాలు అంటారు. పాఠకులు ఆ మూలాలను బట్టి సమాచారాన్ని నిర్థారించుకోవడాణికి ఇది వీలు కలిగిస్తుంది.

వర్గాలు

లక్ష పైన వ్యాసాల వికీపీడియాలో ఒకే రకమైన లక్షణాలున్న వ్యాసాలను ఒకచోట చేర్చి చూపించేందుకు ఈ వర్గం వీలు కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక మండలం లోని గ్రామం గురించి చదువుతున్నామనుకోండి, ఆ మండలం లోని ఇతర గ్రామాల వ్యాసాలు కూడా అదే మండలం వర్గంలో కనపడుతాయి. అలాగే 1964 లో జన్మించిన వ్యక్తి వ్యాసంలో ఆ సంవత్సరం జన్మించిన వ్యక్తుల వర్గం ఉంటుంది.

కొత్త పేజీని (వ్యాసం) ఎలా సృష్టించాలి

వికీపీడియాలో వ్యాసం సృష్టించడం ఒక కొంత క్రమపద్ధతిలో చేయాల్సిన పని. దీని కోసం కొన్ని సూచనలు ఇవ్వబడినవి:

1. ముందుగా వికీపీడియా ఖాతా సృష్టించుకోండి.

  • వికీపీడియా ఖాతా అవసరం లేకుండానే వ్యాసాలను సవరించవచ్చు, కానీ ఖాతా సృష్టించడం ద్వారా మీ రచనలను,

వికీపీడియా గురించి మీకు తెలుసా? 21