ఉన్నాయి. మీకు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, టైపింగు మీచేత అదే చేయిస్తుంది.
కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?
- మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక
సమయంలోనే రాయండి. హాయిగా రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే! రోజూ రాయండి. వారానికి ఒక్కసారే రాయండి, నెలకోసారి రాయండి... మీ ఇష్టం, మీ వెసులుబాటు, మీ తీరిక, మీ ఓపిక.
కానీ రాయడం నాకు కొత్త, తప్పులు దొర్లుతాయేమో?
- నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ
పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి" అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.
పదికోట్ల మంది మాట్లాడే భాష మనది, మరీ ఐదో స్థానంలో ఉండడమేంటీ..
- ప్రచారం లేక. తెలుగులో వికీపీడియా అనే బృహత్తర విజ్ఞాన
సర్వస్వం తయారౌతోంది అనే సంగతి చాలామందికి తెలియదు. 2006 నవంబరు 5 నాడు ఈనాడు దినపత్రిక ఆదివారం
వికీపీడియా గురించి మీకు తెలుసా? 15