సంచికలో తెలుగు వికీపీడియా గురించి వ్యాసం వచ్చింది. దాంతో తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపైంది. ఆ తరువాతి కాలంలో మరిన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. అలా తెవికీని మరింత మందికి చేర్చే ఉద్దేశమే ఈ పుస్తకం కూడా.
మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
అసలు తెవికీలో ఎందుకు రాయాలి
- ఇది మంచి ఉచిత సేవ. మంచి కాలక్షేపం. ఇందులో సముదాయ
సభ్యులు ఉంటారు. వారితో వికీని గురించి ఇష్టాగోష్టి చర్చలు ఉంటాయి. మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది.
- ఇక వికీపీడియాలో ఎందుకు రాయాలి, రాస్తే ఏమోస్తుంది?
అనే దానికి వస్తే, అవును. తెవికీలో ఎందుకురాయాలి, రాస్తే నాకేమి వస్తుంది అనే ఆలోచన రావటంలో ఎలాంటి తప్పులేదు. వికీపీడియా గురించి చెప్పగానే దాదాపుగా నూటికి 90 మందికి వచ్చే ఆలోచన ఇదే.
- అందరికీ అన్నీ విషయాల గురించి తెలియకపోవచ్చు, కానీ
ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంపై కొంత విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అలా అందరికీ తెలిసిన విశేష జ్ఞానాన్ని ఒకచోట చేర్చటం వలన విజ్ఞాన సర్వస్వం తయారవుతుంది.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 16