Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది సరేగానీ... అంతా ఉచితమే అంటున్నారు, ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?

  • అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా

ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమేంటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో చూడండి.

ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?

  • నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు. రాయాలి కూడా.

దేని గురించి రాయవచ్చు? • మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.

మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?

  • ఏం పర్లేదు, తెవికీలో వివిధ రకాల తెలుగు టైపింగు ఉపకరణాలు

వికీపీడియా గురించి మీకు తెలుసా? 14 వికీపీడియా గురించి మీకు తెలుసా?

14