Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

ఏమిటి దీని విశిష్టత?

• వికీ అంటే ఎవరైనా సవరణలు (దిద్దుబాటు) చెయ్యగల ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా (వెబ్సైటు) అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది.

• వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు.

• అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!!

•ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది... ఈ పుస్తకాలను పెద్దసంఖ్యలో ప్రింటేసి, వెల కట్టి అమ్ముకోనూవచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.

వికీపీడియా గురించి మీకు తెలుసా? 12