పుట:Welcome to Wikipedia brochure EN, for print.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వికీపీడియాలో ఖాతా తెరుచుట

మొదటగా చేయ వలసిన పని వికీపీడియాలో ఏదైనా వ్రాయడానికి .... పేరు నామోదు చేసు కోవడము. పేరు నామోదు చేసుకొన్నవారు వికీపీడియాలో క్రొత్త వ్వాసాలు వ్రాయ వచ్చు. బొమ్మలను ఎక్కించ వచ్చు, వ్యాసాలకు కొత్త పేర్లను సూచించ వచ్చు. అంతేగాక పేరు నామోదు చేసుకున్న వారు వారి వీక్షణా జాబితాలోకెళ్ళి తాము ఇదివరకు వ్రాసిన వ్యాసాలలో సవరణ చేయ వచ్చు. ఒక వ్యాసాన్ని మీ వీక్షణ జాబితాలో వుంచాలనుకుంటే వికిపీడియా లోని నక్షత్రం గుర్తుపై నొక్కి చేర్చు కోవచ్చు.

ముఖ్యమైన విషయమేమంటే మీరు చేసిన మార్పులు, చేర్పులు మీపేరున నామోదు అయి వుంటాయి. వికీపీడియాలో మీకొక గుర్తింపు వుంటుంది. దీనివల మీలాంటి ఇతర వికీపీడియన్ల తో సత్సంబందాలు కలిగి వుండ వచ్చు. వికీపీడియాకు అలవాటు పడిన తర్వాత ఇతర వికీపీడియన్ల తో చర్చలు జరప వచ్చు వారి సందేహాలను నివృత్తి చేయవచ్చు.

వికీ పీడియాలో పేరు నామోదు చేసుకోకుండా కూడ మార్పులు చేర్పులు చేయ వచ్చు. కాని ఆ మార్పులు చేర్పులు మీ పేరున కాకుండా అంతర్జాల .ఐ.పి. చిరునామ మీద చేరుగలవు. అటువంటి మార్పులను వికీపీడియా తొలగించే అవకాశముంటుంది; ముఖ్యంగా నిబందనలకు విరుద్దంగా వున్న వాటిని. ఉదాహరణకు.... ఒక పాఠశాల విద్యార్తి తన పాఠశాల గురించి వ్యతిరేకత కలిగి యుంది చెడుగా వ్రాసి పాటశాల గౌరవానికి భంగకరంగా వుంటె.... అలాంటివాటిని తొలిగిస్తారు.

చాలా త్వరగా అయిపోయింది. నాకు ఇప్పడు ఖాతావుంది కాబట్టి, నేను నాణ్యమైన వ్యాసాలు సృష్టించడానికి తోడ్పడవచ్చు.
Sara 05.png

అకౌంటు (పేరు నామోదు చేసుకోవడం) సృష్టించు కోవడానికి వికీపీడియా మెదటి పుట పైన కుడువైపు వున్న అకౌంటు సృష్టించు అను దానిపై నొక్కి మీపేరు వ్రాసి మీకొరకు ఒక పాస్ వర్డ్ ఎంచుకొండి. తరువాత సృష్టించు (create account అను దానిపై నొక్కాలి. అంతే మీరు మీ పేరున అకౌంటు సృష్టించి నట్లే. మీ పేరు వికీపీడియాలో నామోదైపోయింది.

ప్రయత్నించండి.

  1. వికీపీడియాలో పేరు నమోదు చేసుకోవాలి.
  2. వికీపీడియా వాడుకరి అకౌంటు సృష్టించాక మీ వీక్షణా జాబితా లో మీకిష్టమైన వికీపీడియా వ్యాసాన్ని చేర్చుకొని అందులోని మార్పులు, చేర్పులు ఎలా నామోదవుతాయే గ్రహించ వచ్చు. అలా చేయాలంటే ... మొదటి పుటలో పైన కుడివైపున వున్న నక్షత్ర గుర్తుపై నొక్కాలి.


వికిపీడియాలో అకౌంటు సృష్టించటం సులభం మరియు మీరు దానికొరకు వ్యక్తిగత సమాచారము ఇవ్వవలసినఅవసరంలేదు