వికీపీడియన్లు సరికొత్త వ్యాసాలను సృష్ఠించడం, ఉన్న వ్యాసాలను సరిదిద్దడం చేస్తూనే ఉంటారు. సదా దిద్దుబాట్లు జరిగే వికీపీడియా వ్యాసాలను పూర్తిగా సమీక్షించడం, నాణ్యతా నిర్ణయం చేయడం సాధ్యం కానిపని. వికీపీడియా అనే బృహత్తర విజ్ఞానభండాగారంలో భద్రపరిచే వ్యాసాలను ప్రపంచం నలుమూలలలో వున్న వికీపీడియన్లు వ్రాస్తుంటారు. వికీపీడియాలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు ఇది వినోదాన్ని, విజ్ఞానాన్ని కానుకగా అందించే అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు. సామాజిక దృష్టిలో ఒక లక్ష్యం కొరకు పనిచేయడం వింత అయినప్పటికీ క్రియాశీలక వికీపీడియన్లు తమకు తెలిసిన పరిమిత విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి సంతోషిస్తున్నారు.
- ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కరికీ సహాయ పడడమనే విషయం ఎంతో సంతృప్తినిస్తుంది. కాని ఈ విషయమై మరి కొన్ని వివరాలు చెప్పండి? ఎలా ప్రారంభించాలి?
ప్రయత్నించండి!
ఎవరు వికీపీడియాలో గల వ్యాసాలను సవరించగలరు? సరియైన జవాబు ఎంచుకోండి.
□ అనుభవమున్న సంపాదకులు మాత్రమే
□ వికీపీడియా ప్రధాన సంపాదకుడు
□ అంతర్జాల సంపర్కమున్న ఎవరైనా
ఈ ప్రశ్నకు మరియు ఇతర ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకం చివరి పేజీలో కనబడతాయి.