వికీపీడియా ఎలా పని చేస్తుంది?
వికీపీడియాలో వున్న ప్రతి విషయం ప్రపంచ వ్యాప్తంగా వున్న మీలాంటి వారు వ్రాస్తున్నదే. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఇలాంటి వికీపీడియన్లు విషయాలను, వ్యాసాలను, బొమ్మలు మొదలగు విజ్ఞాన విషయాలను చేర్చక పోతే ఈ వికీపీడియా అంతర్జాలంలో ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన భాండాగారంగా అవిర్భవించేది కాదు. వికీపీడియాలో రోజుకు 9700 వ్యాసాలతో నెలకు సుమారు 1 కోటి 20 లక్షల మార్పులతో ముందుకు పోతున్నది. (ఆగస్టు 2012 నాటి గణాంకాల ఆధారంగా)
ఎందరో ఉత్సాహ వంతులైన వికీపీడియన్లు ప్రపంచ వ్యాప్తంగా తమ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న వికీపీడియన్లు స్వచ్ఛందంగా చేస్తున్న కృషిఫలితంగానే విషయాలు మెరుగులు దిద్దుకుంటూ అభివృద్ధి చెందుచున్నాయి. వికీపీడియాలో ఏ విషయాన్నైనా చదువుకొనుటకు, దిగుమతి చేసుకొని వాడుకొనుటకు, దానిని మార్చి వాడుకొనుటకు అవకాశమున్నది. వికీపీడియాలో విషయాన్ని చాలా రకాలుగా ఇతరులతో పంచుకోవచ్చు.
- కాని...... ఎవరు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎవరి ఆధీనంలో ఇది పని చేస్తున్నది? వికీపీడియా ప్రధాన సంపాదకుడెవరు?