ఈ పుట ఆమోదించబడ్డది
వికీపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద విజ్ఞాన సర్వస్వం. ప్రపంచం మొత్తం మీద దాదాపు లక్ష మంది ద్వారా ఈ విజ్ఞాన సర్వస్వం తయారుచేయటం, నిర్వహించటం జరుగుతుంది. ప్రతి నెలా వికీపీడియాను 45 కోట్ల మంది కొత్తగా సందర్శిస్తున్నారు. 280 పైగా భాషలలో 2.3 కోట్ల వ్యాసాలతో వికీపీడియా అలరారుతున్నది. దీనిని ఉచితంగా వాడుకోవచ్చు, స్వేచ్ఛగా మార్చవచ్చు. దీనికి వాణిజ్య ప్రకటనల బెడద లేదు.(ఆగష్టు 2012 వివరాలతో)
వికిపీడియా స్వయంశిక్షణ చదవటం ద్వారా మీరు:
- వికీపీడియా పనిచేయు విధానాన్ని తెలుసుకుంటారు
- వికీపీడియాలో మీ ఖాతాను తెరవగలుగుతారు
- వికిపీడియా ఇంటర్ఫేస్ ను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు
- వికీపీడియాకు ఎన్ని విధాలుగా తోడ్పడవచ్చో తెలుసుకుంటారు
- "నా చర్చా" పేజీ ద్వారా ఇతర వాడుకర్లతో సంభాషించగలుగుతారు
- వికీపీడియాలో ఒక వ్యాసం పరిణామ క్రమాన్ని తెలుసుకోగలుగుతారు
- నాణ్యమయిన వ్యాసం గుణవిశేషాలను గుర్తించగలుగుతారు
- ఒక కొత్త వ్యాసాన్ని రాయగలుగుతారు.
"నమస్కారం నా పేరు అనుపమ! నేను ఎప్పుడైనా ఒక విషయాన్ని వివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే వికీపీడియాను వాడతాను. కానీ చాలా రోజులుగా నేననుకుంటున్నదేంటంటే - ఈ వ్యాసాలన్ని ఎవరు రాస్తారు? ఎందుకని ఈ వ్యాసాలు తరచూ మార్పిడి చెందుతుంటాయి? వికిపీడియాను ఎవ్వరైనా సవరించవచ్చని నేను చదివాను. నేనూ అలా సవరించవచ్చా? అది ఎలా?"
