విషయాలు: పలు వికీపీడియన్లు వ్యాసనాణ్యత నిర్ణయించడానికి విషయాలు అతిముఖ్యమైనవి అనుకుంటారు. స్థిరమైన విశ్వసనీయమైన నాణ్యతనిర్ణయం కొరకు వికీమీడియా సముదాయం నాలుగు మార్గదర్శకాలను నిర్ణయించారు.
- మూలాలను అందించడం: వివరాలను పరిశీలించడానికి అవసరమైన మూలాలను అందించేలా సభ్యులను ప్రోత్సహించడం. ప్రతి వాస్తవాన్ని విశ్వసనీయమైన మూలాలతో పరిశీలించడం.
- తటస్థ దృక్కోణం: వ్యాసాలు పూర్తిగా నిష్పక్షపాత దృష్టి, గడిచినకాలంలో ముద్రితమైన ముఖ్యమైన అభిప్రాయాలను ప్రదర్శించాలి.
- ప్రచారదృష్టి రహితం : ప్రకటనా పద్ధతులు, ఎలా అనే సూచనలు, పరిచయపత్రాలు, విక్రయజాబితాల వంటివి వికీపీడియా వ్యాసాలలో చేర్చకూడదు.
- స్వంత పరిశోధన నిషేధం: ఒక విషయం గురించి మీ స్వంత పరిశోధన, ఆలోచనలను, (వికీపీడియా వీటిని స్వంత పరిశోధనగా భావిస్తుంది) మీ వ్యక్తిగత అభిప్రాయాలను చేర్చటం సమంజసం కాదు.
సముదాయం: - వికీపీడియా సభ్యులందరూ ఉచిత లైసెన్స్‌తో తమ వ్యాసాలను ఇతర దిద్దుబాట్లను వికీపీడియాలో చేర్చుతుంటారు. ఏ వ్యాసం ఏ సభ్యునకు స్వంతం కాదు. వ్యాసాలన్నీ పలు సభ్యులతో దిద్దబడుతుంటాయి. మరోమాట చెప్పాలంటే నిర్ణయం తీసుకునే విధానంలో ప్రతి వికీపీడియన్ భాగస్వామ్యం వహిస్తారు. వ్యాసం చర్చాపేజీ, వ్యాస విషయాల నిర్మాణం చర్చించడానికి సరైన ప్రదేశం. ఒక్కోసారి వ్యాసం సర్వామోదం పొందడానికి కష్టతరమైనపుడు వికీపీడియా:వివాద పరిష్కారం పేజీ చూడండి. వికీపీడియాలో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న సభ్యులు, రచయితల అనుభవం వివాదాలు పరిష్కరించడానికి ప్రధాన వనరుగా భావించవచ్చు.
వికీపీడియాలో ఇందుకు సంబంధించిన వ్యాసం కనబడలేదు. ఎవరైనా ఇటువంటి వ్యాసరచనకు ప్రయత్నిస్తారేమో ఎదురుచూడాలా?