నాణ్యమైన వ్యాసానికి కావలసినవి ఏవి?
చక్కగా నిర్వచించబడిన వ్యాస నిర్మాణవిధానాలను అనుసరిస్తూ, క్రియాశీలక సభ్యులతో విజ్ఞాన సర్వస్వపరమైన విషయాలతో తీర్చిదిద్దబడే వ్యాసమే నాణ్యత కలిగిన వ్యాసం.
నిర్మాణం: వ్యాస నిర్మాణం, స్పష్టమైన నాణ్యమైన వ్యాసాన్ని తయారుచెయ్యడానికి,. పాఠకులు తమకు కావలసిన వివరాలు చక్కగా తెలుసుకోవడానికి, సభ్యులు వ్యాసాన్నివివిధ దృక్కోణాలలో తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది. నిర్మాణం గురించి తెలుసుకోవడానికి వికీపీడియాలో చక్కగా రూపుదిద్దుకున్న వ్యాసాలను పరిశీలించడం ఒక మార్గం. విశేషవ్యాసాలను అన్నింటిని మొదటి పేజీలోని వివరాల అధారంగా చేరుకోవచ్చు. ఈ వారం వ్యాసం జాబితా అనే లింకును నొక్కి ప్రత్యేకవ్యాసాల జాబితా ఉన్న పేజీకి చేరుకోండి. స్క్రోల్ బారును కిందకు లాగుతూ మిమ్మల్ని ఆకర్షించిన వ్యాసాన్ని ఎన్నుకోండి.
నాణ్యత గల వ్యాసాల నిర్మాణం ఈ క్రిందివిధంగావుంటుంది.
ప్రారంభ భాగం: వ్యాసంలోనిప్రధానమైన అంశాలను క్లుప్తీకరించబడిన భాగం. దీనికి శీర్షిక వుండదు.
తరువాతి భాగాలు: శీర్షికలు ఉపశీర్షికలతో వివరాలుంటాయి. ఉదాహరణగా ఒకప్రదేశాన్ని గురించిన వ్యాసంలో చరిత్ర, భౌగోళిక వర్ణన, వాతావరణం, ఆర్థికం, పాలనావ్యవస్థ, గణాంకాలు, సంస్కృతి అనే శీర్షికలు ఉపశీర్షికలతో ఉండడం గమనించవచ్చు.
అనుబంధాలు, పాదసూచికలు: అదనంగా వెలుపలి లింకులు, ఇవికూడా చూడండి, మూలాలు వంటి శీర్షికలతో వ్యాసానికి సంబంధించిన వికీపీడియాకు వెలుపలి అంతర్జాల పేజీల లింకులు, వ్యాసానికి సంబంధం ఉన్న వికీపీడియాలోని ఇతర వ్యాసాలు, వ్యాసరచనకు ఆధారంగా ఉన్న వెబ్‌పేజీల లింకులు, వర్గాలు వ్యాసానికి సంబంధించిన ఇతరవ్యాసాల మూసలు మొదలైనవి ఉండడం గమనించండి.
ప్రయత్నించండి.
1 వ్యాసంలోని మధ్యభాగాలలో శీర్షికలు లేవు. సరియైన సమాధానం ఎంచుకోండి
□ సరి
□ తప్పు
2 నాణ్యమైన వికీపీడీయా వ్యాసంలో ఉండవలసినవి విషయాలు ఏమిటి? క్రింది వాటిలో సరిపోయినవన్నీ ఎంచుకోండి
□ పరిశీలించతగిన అధారాలు.
□ తటస్థ దృక్పథం
□ ఎలా- ఏమిటి- ఎందుకు అన్న సూచనలు.
□ సంగ్రహం, వివరాలతో కూడిన భాగం, మూలాలు