ఈ పుట ఆమోదించబడ్డది
- చివరిగా, బాగావ్రాయబడినదనీ, మూలాధారలతో వ్యాసం సమగ్రంగా ఉన్నదని ఇక విషయ నిపుణులు మాత్రమే ఇక దీనిని మెరుగుచేయగలరనే స్థాయికి వ్యాసం చేరుతుంది. వీటిని మంచి వ్యాసాలుగా పరిగణిస్తారు. కొద్ది వ్యాసాలు సముదాయం దృష్టిలో ఉన్నతమైన నాణ్యతగా భావించబడతాయి. అటువంటి వ్యాసాలలో విశేష వ్యాసాలుగా పరిగణించి వికీపీడియా ప్రధాన పుటలో ప్రదర్శించుతారు. ఆ స్థాయి వ్యాసాలు తయారవడము చాల శ్రమ, సమయంతో కూడుకున్న పని. ఈ పనిలో సహకరించడం చాలా తృప్తినివ్వటమే కాక సమదాయంలో గౌరవం పెరుగుతుంది. మిగతా వ్యాసాలతో బాటు ఈ వ్యాసాలుకూడ నిత్యము సవరింపునకు గురౌతుంటాయి.
లక్షల పాఠకులు చదివే జాలస్థలిలో మొదటి పేజీలో ప్రదర్శించటానికి వ్యాసం వ్రాయడంలో నేను కృషిచేయాలని కలగంటున్నాను.
ప్రయత్నించండి!
వికీపీడియాసహసభ్యుల సమీక్ష విధానం అంటే ఏమిటి ? సమాధానం ఎంచుకోండి
□ వికీపీడియా సభ్యులబృందం వ్యాసనాణ్యత నిర్ణయించుట
□ నిపుణుల బృందం వ్యాసనాణ్యత నిర్ణయించుట.
□ వికీపీడీయా సంస్థ వ్యాసనాణ్యత నిర్ణయించుట.