ఈ పుట ఆమోదించబడ్డది
ఒక వ్యాసం జీవిత కథ
వికీపీడియాలో చాలా సమగ్రమైన ప్రామాణికత కలిగిన వ్వాసాలుండాలి. ఆ వ్యాసాలు ఒక్కసారిగా అలా పుట్టుకొచ్చాయని ఎవరూ ఊహించరు. ప్రతి వ్యాసము చిన్నదిగా ప్రారంభమై అనేకమంది చేత దిద్దుబాట్లకు గురై, అందరి విస్తృత సహకారముతో ఈ క్రింద ఇవ్వబడిన తరహాలో అభివృద్ధి చెందుతుంది.
- విశేష వ్యాసంగా గుర్తింపు పొందిన అనేక వ్యాసాలు మొదటగా వ్యాసానికి సంబందించిన విషయమై క్లుప్తమైన వివరణ (సంగ్రహం), ఆ వ్యాసం ఎందుకంత ప్రముఖమైనదో తెలియజేసే వివరంతో(ప్రథమాలు...", "అతి పెద్దదైన...", "...కు రాజధాని" లాంటివి), ప్రాముఖ్యతను నిర్థారించుకోవడానికి వికీపీడియా వెలుపల ఇతర ప్రముఖ సంస్థల ముద్రణలు లేక జాలస్థలాలను పేర్కొనటంతో ప్రారంభమవుతుంది. అటువంటి వ్యాసాన్ని 'మొలక' అని అంటారు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా పాఠకులలో అదంత ప్రాముఖ్యత కలిగినది కాదు అనే భావమేర్పడి ఆ వ్యాసం తొలిగించే అవకాశమున్నది.
- ఇతర సభ్యులు పాఠ్యము, బొమ్మలు చేర్చుతుంటే, ఈ వ్యాసం విషయం సంగ్రహ స్థాయినుండి వివిధ ధృక్పథాలను అనగా చారిత్రక (ఉదాహరణకు "1923 లో కొత్త కారణాలు...") లేక ప్రపంచ (ఉదాహరణకు "యూరప్ లో దీనిని అనుకొన్న విధము") దృక్పథాలను చేరిస్తే వివరమైన వ్యాసంగా రూపొందుతుంది. ఎక్కువగా పనిచేసే సభ్యులు దీనిని వికీపీడియా సహసభ్యుల సమీక్ష విధానానికి ప్రతిపాదించవచ్చు. ఈ పద్ధతిలో చాలా మంది సభ్యులు నాణ్యతను జాగ్రత్తగా సమీక్షించుతారు. ఈ పద్ధతి చాలాపనిజరిగిన వ్యాసాలకు అమలుచేస్తారు. ఈ సమీక్షపద్ధతిలో వ్యాఖ్యలకు, ప్రశ్నలకు, సలహాలకు తగినవిధంగా సమాధానమివ్వాలి. అలా వ్యాసాన్ని అభివృద్ధిచేయటానికి ప్రణాళికను చర్చాపేజీలో చేరుస్తారు.