కొత్తవ్యాసం సృష్టించడం
తెలుగు వికీపీడియా వ్యాసాలుగా వ్రాయని అనేక విషయాలు ఉన్నాయి. మీరు అనుకున్న వ్యాసం వికీపీడియాలో లేదని మీరు భావించారంటే, ఆవిషయానికి సంబంధం వుండగలిగిన వ్యాసాల కొరకు శోధించండి. ఉదాహరణగా విషయసంబంధిత పేరులో స్వల్పమార్పులతో శోధించండి. అలాగే విషయానికి దగ్గర సంబంధం ఉన్న ఇతర వ్యాసాలు ఉన్నాయేమో శోధించండి. ఉదాహరణకు ఒక ద్వీపం గురించి శోధించాలంటే అది ఏదేశానికి చెందిందో అక్కడ ఉండవచ్చు. ఒకవేళ ఆ విషయం వికీపీడియాలో ఇంకా వ్రాయబడకుంటే అంత ప్రధానమైనదికాని గ్యారేజీ బ్యాండ్ లేక బ్లాగు మాత్రమే గల అంతగా పేరులేని వ్యక్తి దై వుండవచ్చు. మీరు ఆ విషయం తప్పక వికీపీడియాలో వుండాలని అనుకుంటే మీరే ఆ వ్యాసం సృష్టించవచ్చు.
వ్యాసం కొరకు శోధించండి. వికీపీడియాలో వ్యాసం లేకుంటే మీరు వ్యాసం శీర్షికను ఎర్ర హైపర్ లింకులో చూస్తారు. కొత్తవ్యాసం ఆరంభించడానికి ఆ హైపర్ లింకుని నొక్కండి. మీరిక మీ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు.
మీ కొత్తవ్యాసం ఒక మంచి వ్యాసం కావాలంటే ఈ మూడింటిపై శ్రద్దపెట్టండి:
- వ్యాసం సంగ్రహరూపం
- విషయం ప్రాధాన్యం తెలిపే కారణాలు
- విషయానికి సంబంధించి ప్రామాణికమైన మూలాలు