Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 వ్యాసమంజరి నాకర్షించెడును. మఱియుఁ దనచింతతోఁ బ్రారంభించినను భీమసేనునికిఁ దక్కినభర్తలకును గలిగినకష్టములను మఱనలేదు. " పాణిపల్ల వఁబుల నయనసమార్జనంబు సేయుచు ” ననువర్ణనము ద్రౌపదీ దేవియొక్క పరి వేదనాతప్తమూర్తిని మనకండ్లయెదుట సాక్షాత్కరింపఁ జేసెడును గదా ! ఎట్లును శృంగారము, శోకము మున్న గురసముల వర్ణించుటలో మహాకవులై నకవిత్రయమువారు మొత్తముమీఁద మితము ననుసరించి చిత్రింతురు. విపరీతపుమాటలకుఁ జేష్టలకు నెడమియ్యరు. కీచకుని కామము వర్ణించుటలోఁ దిక్కన పచ్చిగా వ్రాసియున్నాఁడు. కాని యది వానినీచతను విశదపఱుచుటకని తానే తెలిపియున్నాఁడు. కవిత్రయము వారిపాత్రము లా తనిగ్రహములేని మృగ ప్రాయములు కావు. తిక్కన్న ఎఱ్ఱన్నల తారతమ్యనిరూపణమునకుఁ బనికివచ్చుఘట్టములు కొన్ని యున్నవి కాని వాని ప్రశంస కిటఁ బ్రవేశము లేదు. C నన్నయ్య “ గురుపద్యవిద్యకు నాద్యుఁ డగుట కాదు, గద్య విద్యకు నాతఁడాద్యుఁడు. ఆంధ్రమున వచనము నితఁడు వ్రాసినంత మనో హరముగ వ్రాసినవా రొరులు లేరు. చిన్నయ్య సూరి యితనిఁజూచియ తనరమణీయ మైనమిత్ర లాభమును రచించియుండు నని తోఁచెడిని. ఈ క్రిందియుదాహరణముల శైలినిజూడుఁడు. మిత్రలాభముయొక్క మాతృ కలిట్టివి : "వ. అని దీన వదనుండై యాక్రోశించువానికి నాకాశంబున నుండి యొక్క దేవదూత యిట్లనియె నయ్యా! కాలవశంబయిన నెవ్వ రికిం దీర్పఁదరంబుగా, దొక్క యుపాయంబు గలదు. చేయనోపు దేనిఁ జెప్పెద వినుము. నీయాయుష్యంబునం దగ్ధం బిక్క వ్యకిమ్మనిన గురుం డట్లచేయుదు నని తనయాయువ్యంబునం దర్ధం బక్కన్యక కిచ్చిన నకోమలి దొల్లింటి కంటే అధికశృంగారసమన్వితమై విషనిర్ముక యయ్యె; నట్లు దేవదూత ధర్మరాజానుమతంబునఁ దన చెప్పినయు పా CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri