అధ్యక్షుని వచనము 30 యంబునం బ్రమద్వరను బంచత్వంబు వలనం బాపె. రురుండును దాని వివాహం బై యిష్టోఫభోగంబుల ననుభవించుచు నుండి. (ఆదిపర్వము, ఆశ్వా౧యో) "వ. అయ్యా ! నీవు బ్రాహ్మణుండవు. భృగువంశసముత్పన్నం డవు. సర్వగుణ సంపన్నుండ, విదియేమి దొడంగి తిట్టి దారుణ క్రియా రంభంబు క్షత్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే? సాపరు, లొరులు నేయుహింసల వారించు పరమకారుణ్యపుణ్యమూర్తులు, బ్రాహ్మణు . జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందుఁ గద్రుశాపంబున నయ్యెడు సర్పకుల ప్రళయంబును భవత్పితృ శిష్యుండయిన యా స్త్రీ కుండను బ్రాహ్మణుండ కాఁడె యుడిగించె నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునం దుపశమనబుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహా మును లక్కథకున కిట్లనిరి. ” ( ఆది, అశ్వా౧ - ౧౯) వీరిగద్యముయొక్క మాధుర్య మవచనీయము. అర్థ పుష్టియు మృదుత్వమును, ఇట్లుసంయోగించి యుండుట నేనింకెయ్యెడనుగాన. మృదుత్వ ముండుచోట వర్థ మబలముగా నుండును. అర్థము ఘనమైన చోట్ల శైలి గడుసు వాఱును. ఈ కొఱఁత, భారతకవులలోను, నన్నె చోడునిలోను గాన్పింపదు. వీ రేశలింగము మొదలగువిమర్శకులు కొందఱు ఆరణ్యపర్వము నందు శైలి బలము తగ్గియున్నదనియు, నవసానకాలము యొక్క లక్ష ణము లందుఁ గానఁబడుచున్న వనియు వ్రాసినారు గాని యుదాహరణ ములఁ జూపరైరి. " లోకో భిన్న రుచిః " నేను నావల్లనైనంత యక్క ఆగాఁ జదివితిని గాని ఆరణ్యపర్వమున క్షయలక్షణము లెవ్వియుఁ నాకుఁ గనఁబడలేదు. ఆదిపర్వముయొక్క కడపటిభాగములలోను, సభాపర్వములోను నీరసమైనపద్యము లక్కడక్కడ నున్నవి. పదముల CC-0. Jangamwadi Math Collection. Digitized by e Gangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/45
స్వరూపం