Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షునివచనము' a పూర్తియగుటకు మున్నే నన్నయ్య చచ్చుట, భారతరచనా పాపమున కారోపించియుందురు. తిక్కన పాపపరిహారార్థము కాఁబ్రోలు యజ్ఞ మును జేసి పిమ్మటఁ బంచమ వేదములో మిగిలిన భాగమును 'దెనిఁగించుట కారంభించెను. ఎఱ్ఱన తన పేరు పెట్టిన నెట్లో యని, నన్నయ్య పేరిట ఆరణ్య పర్వ శేషము "తద్ర చనయ కాఁ బూరించెను. వేదమను వేరువహిం చిన దానిని దెలుఁగుచేయుట యనఁగా నాకాలము వారి మత వ్రకారము దోషముగాఁ దోఁచియుండునేమో ! ఈనాఁటికిని సంస్కృత పాఠ శాలలలో శూద్రులను జేర్చుట యక్రమమని యాతేషేపించు వైదికు లున్నా రే ! ఆనాఁటిగతి యేమిగా నుండవచ్చును. తిక్కన్నయు జైనులు మొదలగు నాస్తికులతో, అనఁగా వేదములు నిరాకరించువారితో, వాగ్యుద్ధములు చేసినవాఁడని సోమదేవరాజీయమువలనఁ దెలియు చున్నది. అతఁడును. వైదిక క్రియలను, వర్ణధర్మములను ఉద్ధరించుట కే భారతమును దెనిఁగించియుండును. (అ) ఆదికాలము కృతులన్నియు మత సంబంధములుగా నున్నవి. (3) ఈ గ్రంథము లన్నింటిలోను వర్ణధర్మములే ప్రధాన తత్త్వము. పూర్వ మీమాంసకులకుఁ గావలసినవి రెండు : యజ్ఞములు,

-

బ్రాహ్మణపూజ. వేదములకు మించిన "సత్తు ఉండఁగూడదని కాఁబోలు, వారు, దేవుఁడు కూడ లేఁడు, వేదములు శాశ్వతములు, వేదములే సర్వమని సిద్ధాంతీకరించిరి. మఱియు నొక విశేషము. ఈ గ్రంథములలోఁ బదేపదే " వేదముల నిట్లు చెప్పియున్నది, అట్లు చెప్పియున్నది" యని తమ యా దేశముల కన్నింటికి వేదము రములని వ్రాయఁబడియున్నది. నిజము పరికించి చూచిన నూటికిఁ బదింటికైన వేదములలో నేయాధారము నుండదు. ఈ వేద ఘోష ముక్కాలు మువ్వీసము నిరాధారమును, అసాక్షికమును. ఇట్లు వేద CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri