Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

QE వ్యాసమంజరి ముల నిచ్చవచ్చిన చోటులనెల్ల సాక్ష్యమునకుఁ బిలుచుట యప్పటి వారి కృపాయము లేని యుపాయము. జనులకు వేదములఁజూపరు, చెప్పరు. " అసలు " తమ యధీనము. వారు కల్పించిన "నకళ్ల నమ్మవలసినవారు జరులు ! వాదములకు, బహుశః అపవాదములకు, నాకరములైన చరిత్ర విచారణల నింతటితోఁ జాలించి క్రీడాభిరామమైన సాహిత్యగోష్ఠికిఁ గడఁగుదము. నన్నయ్య కళాకౌశలమును గూర్చి యెందఱో వ్రాసియున్నారు. వారికంటికిఁ గనఁబడనివియు, వారిచే వర్ణింపఁబడనివియు నైన విలా సము లెవ్వియు నుండవు కాఁబోలు! విమర్శనము శిల్పమునకు, శాస్త్ర మునకు మధ్యవర్తియై, రెండింటియు గుణములు దాల్చినకళ. భావ పూర్ణముగ నుండినచో. శిల్పమేనాఁడును బ్రాఁతవడదు. చర్విత చర్వ ణము గానేరదు. సదా నవ్యముగ నుండును. ఏలన, భావములును, రస ములును, బ్రతివ్యక్తియందును వేర్వేఱుగనుండును. వాని ననుసరించి రచించినయెడల నారచనయు వ్య క్తిత్వముఁ దాల్చియుండును. అయ్యది విశేషముగా నుండును, సామాన్యముగా నుండదు. సహజమును నకృత్రి మమును అగు రచన యనన్యసామాన్యము. కావునఁ బ్రతిరసికుఁడును దనతన భావముల ప్రకారము విమర్శించుట యధిక ప్రసంగము కానే రదు. నన్నయ్యయొక్క శైలి మిక్కిలి మనోహరమైనది. అనన్య తుల్యము. దానివంటిది వేల్గొండులేదు. సంస్కృతపద భూయిష్ఠ మై యున్నను సర్థ కాఠిన్య మేమాత్రము లేనిది. అతఁడుపయోగించు తత్స మము లితరు లనేకులు వాడు తెలుఁగు పదములకంటే శబ్దమునందును, అర్థమునందును సరళములు. సాధారణముగా సంస్కృతపదములను, సమాసములను బ్రయోగించువా రాడంబరములఁ బ్రకటింతురు; ఆ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri