వ్యాసమంజరి . మఱియు బ్రాహ్మణులయందుఁ జాళుక్యులకు భక్తి యెక్కువగ నుండవలయునని వారివంశ స్థాపకుఁడు బ్రాహ్మణాశ్రయమునఁ బెరి గెనని యొక పురాణమును గల్పించిరి. త్రిలోచనపల్లవుఁ డనుమూలపురుషుఁడు యుద్ధములోఁ జావఁగా, వాని భార్య, గర్భిణి, కడపజిల్లాలోని 'ముడి వేము' అను గ్రామమున విష్ణుభట్టు అను బ్రాహ్మణునింట సురక్షితు రాలై యుండి బిడ్డను X నెనఁట. ఆబిడ్డకుఁ గృతజ్ఞ తార్థము విష్ణువర్థనుఁ డనుపేరిడఁబడెనఁట. వాఁడు పెద్దవాఁడై పార్వతీ దేవిని గుఱించి చళుక్య. గిరిలో తపస్సు చేసి దివ్యసాధనములు వడసి శత్రువుల నోడించి రాజ్యము స్థాపించెనఁట. ఈకట్టుకథ నందంపూడి శాసనాదులయొక్క పీఠిక. విష్ణు వర్ధనుఁడను పేరును, “ చళుక్య యను పేరును ఈవంశమునఁ బ్రసిద్ధము " " లగుటచేత నా బ్రాహ్మణుని, ఆపర్వతమును వానింబట్టి సృష్టించిరని చరిత్ర పాఠకులకు వేఱుగఁ జెప్పవలయునా ? కాఁబట్టి భారత గ్రంథరచనయొక్క యుద్దేశము వర్ణధర్మరక్ష ణముగాక వేటేమియుండును. భాషనే పరమార్థముగ భావించి సేవించుచిత్తప్రవృత్తి యాకాలమున లేదు. ఉండినచో మత గ్రంథ ములు తప్ప నితరము లేల వ్రాయఁబడక పోయినవి. ఆంధ్ర కావ్యరచన యప్పటికి నవీనసంస్కార మనుటకు మఱి కొన్ని ప్రమాణములున్న వి. (౧) నన్నయ్యకు, శ్రీనాథునికి మధ్యస్థమైన మన కాలములో నప్పు డప్పుడు సకృత్తుగ నాంధ్ర కావ్యములు వెలువడుచుండెనేకాని తదనంతర మట్లు పుంఖాను పుంఖములుగను నిరంతర ధారగాను రాలేదు. కారణ మేమయియుండనగును ! ఆంధ్రకవిత్వము పూర్వాచారము కామియు, నూతన సంస్కారమగుటయు. మనవారు నవీనములపొంతఁ బోవరు, పాపమనిశంకింతురు. ఇదియకదా కారణము. తుదకు భారతము పూరింపఁబడుటకును ౨౦0 ల సంవత్సరములు పట్టుట, గ్రంథము CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/28
స్వరూపం