Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షుని వచనము నన్నయభట్టు, మన కాదికవి యని పారంపర్యముగా వచ్చుమాట సత్యము. ఉద్దేశము బ్రాహ్మణమతో ధారము. చెదను. ఈవాదమునకుఁ బోషకములైన మఱికొన్ని సంగతుల నివేదిం (౧) వర్ణధ ర ములఁ గాపాడుటయం దనురక్తులై యుండవలయు నను నాశచే నేజాతియందుఁ బుట్టిన వారైనను సరే రాజులై రేని, వారికి సూర్య చంద్ర వంశోత్పత్తిని గల్పించుట మన సంప్రదాయములలో నొకటి. శూద్రుఁడైన శివాజిని సయితము పట్టాభిషేకమునకు ముందు నాఁడు యజ్ఞోపవీతధారణము చేయించి, కాశినుండి దీనికొఱకు రప్పింపఁబడిన విప్రవర్యునిచే మంచి వంశావళిని సృష్టి చేసి క్షత్రి యునిగా మార్చియుండుట చరిత్రములోఁ బ్రసిద్ధము. చళుక్యులకును ఈ మర్యాద తప్పినది కాదు. వారు చంద్రమండలమువఱకు వ్యాపింప వలసినవారైరి. మహమ్మదీయులు వచ్చువఱ కిట్టితంత్రములచేత హిందూజాతి తనయైక్యమును, దార్థ్యమును రక్షించుకొనుచుండెను. హూణులు, పహ్లవులు, శకులు మొదలగు విదేశీయులను మనజాతిలోనికిఁ జేర్చు కొనుచుంటిమి. అట్లు చేరుట వారికిని లాభకరముగ నుండెను. ఎట్లన, క్షత్రియులుగా గణింపఁబడుట యొకటి; ఈ దేశము నివాసభూమిగాఁ జేరినవారగుట దేశస్థులతోఁ గలసిమెలసి విప్లవములు లేక యేలుట రెండు; హిందువులనమ్మిక ననుసరించి రాజులగుటతోఁ గూడ దేవత లగుటయు సంభవించును గదా! దానిచేత వారికి గౌర వాధిక్యము కలుగుట మూడు, మహమ్మదీయు అన్యమత ద్వేషులు. ఇంగ్లీషువా రీ దేశనివాసమును గోరరైరి. క్రైస్తవులగుట వారును జాతి ప్రధానమైన 'మతమును వరింపరు. అట్లగుటఁ బూర్వ మెట్లెట్లో యుద్ధరింపఁబడు చుండిన దేశ మైక్యమును గోల్పోయినది. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri