వ్యాసమంజరి (అ) నన్నయకు ముందునాళ్లలోఁ దెనుఁగుకృతులు లేవనియుఁ, జాళుక్యుల యాశ్రయమున నాంధ్రకవిత్వము (అనఁగా గొప్ప గ్రంథ ముల రచన) సృష్టికి వచ్చెననియుఁ జెప్పుట కేయనుమానమునకుఁ బాత్రముకాని ప్రత్యక్ష సాక్ష్యమే యున్నది. ఆసాక్ష్య మమోఘము. నన్నె చోడక విశిఖామణి నన్నయకుఁ దరువాతివాఁడు. కాలమునుబట్టి చూచిన సమీపస్థుఁడు. తిక్కనకుఁ బూర్వుఁడు. బ్రాహ్మణేతరుఁ డౌటఁ దనస్తుతిని దరువాతి కవులు చేయకున్నను, వాని కాలనిర్ణయమున కిత రాధారములు కలవు. అతఁడు తనకుమారసంభవమున నిట్లు వచించి యున్నాఁడు. 客飯 క. మునుమార్గకవిత దేశం బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం గును నిలిపి రంధ్రవిషయం బునఁజనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్. " పుట్టించి " యనఁగా నూతనముగ సృష్టికిఁ దెచ్చియని యర్థము . ఇక్కడఁ బేర్కొనఁబడిన చాళుక్యరాజు, రాజరాజు గాక, యింకొకఁ డనుట యసాధ్యమైన కార్యము. పూర్వము సంస్కృత కవిత్వము వ్యాప్తిలో నుండెననియు, రాజరాజు మొదలగు చాళుక్యులు దేశి కవిత, యనఁగాఁ దెనుఁగుకవిత్వమును గృతిరచనను, బుట్టించి నిలిపి రనియు, నన్నెచోడునిసాక్ష్యము. ( శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు పై పద్యములో " సత్యాశ్రయుని దొట్టి చాళుక్యనృపుల్ " అను పాఠాం తర మున్నదని వ్రాసియున్నారు. కాని వారేమాతృకనుబట్టి యట్లు వ్రాసిరో దానిని బండితుల శోధనకు యాచితులయ్యు నర్పింపరైరి. కాన వారిమాట విశ్వసనీయంబుకాదు.) కావున నాంధ్రకవిత్వమును బ్రచారమునకుఁ దెచ్చిన వారు చాళుక్యులని స్పష్టమగుచున్నది. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/26
స్వరూపం