Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షుని వచనము 00 నవలంబించినవారై, బ్రాహ్మణమతమును విసర్జించి యుండుట సుప్ర సిద్ధము. అన్యమతముల నవలంబించినవారో, వానియం దభిమానము దాల్చినవారో యైనయీజనుల మరల హిందూమతములోఁ జేరువారిని గాఁ జేయవలయునన్నను, ఉండుహిందువులు తమవర్గమును వదలి పోకుండునట్లుంచవలయునన్నను, దేశభాషామూలక ప్రచురణము లని వార్యము లయ్యెను. ఇదియ యాంధ్రవాఙ్మయసృష్టికి మూల కారణ మని నాయూహ. శ్రీ భావరాజు కృష్ణారావుగారు ప్రసంగవశమునఁ జెప్పినకొన్ని యంశములు నాయందీ భావములు పుట్టుటకుఁ గారణములు. ఇది సిద్ధాంతముగాఁ దేలినట్లయిన దాని గుణము కృష్ణారావుగారి కారోపిత మగునుగాక ! తమమతమును రక్షించుకొఱకును, దానితో పాటు అగ్రవర్ణుల యధి కారము పదిలపఱుచుటకునై ప్రాచీన మత గ్రంథ ముల దేశ భాషలలోనికిఁ బరివర్తింపఁ జేసిరి. వర్ణాశ్రమపరాయణులును, దమవైరులు ప్రయోగించిన దేశ భాషా ప్రకటనాస్త్రమే తామును బ్రయోగింప వలసినవారైరి. ఇదియ కాఁబోలుఁ దొలుదొల్తన పంచమవేదమును స్పృశించుటకు హేతువు. అసలు వేద మైన ఋగ్వేద మును, దానిననుసరించి కల్పింపఁబడిన తక్కినమూటిని జనులకుఁ గనఁ బఱుచుట పాతకముకదా! పాతకముగాకున్నను లాభకరము కానేరదు. ఋగ్వేదమును విచక్షణతతోఁ జదివినవారు వర్ణధర్మముల నంగీకరింతు రనుట నిశ్చితార్థము కాదు. కావునఁ బంచమవేదమే ప్రయోజన కారి యైనకృతి. దానిన మొట్టమొదటఁ దెనిఁగించిరి. ఆ ఇఁక బౌద్ధులు, జై నులు వ్రాసిన దేశ భాషా గ్రంథము లేమాయెను! ఆ మతములు దక్షిణదిక్కునకు వ్యాపించునప్పటికి వానికిఁ బాఁత భావ పావన భాషగా నేర్పడినందున బహుళః తెనుఁగున నెక్కువగ వ్రాయరై రేమో! వ్రాసిన కొన్నింటిని ఆమతస్థుల రూపుమాపిన ట్లే మనవర్ణ ధరత్యక్ష కులు ధ్వంసము చేసియుందురు. వేఱు కారణములు మృగ్యములు. 3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri