వ్యాసమంజరి
పునరుద్ధరణ కాలముతో సమన్వయించినది. పునరుద్ధరణకు నీతఁడు సర్వవిధముల సహాయము చేయుటయకాక, రాజ్యము యొక్క విస్తీర్ణ మును బెంచిన వారిలో నొక్కఁడై రణకీర్తి గడించిన వాఁడని యందమా, దానికిఁ దగిన యాధారములు లేవు. నిజమే కాని, భారతములో " పరమండలంబుల ధరణిపతులు | నదిమి కప్పంబులు ముదముతోఁ గొనుచును బలిమి నీయని భూమి వలయ పతులు | నక్కడఁగించుచు " అనియు, నందంపూడి శాసనములో యస్యస్ఫార భుజాకృపాణ దళితారాతీభ కుంభస్థల | ప్రోన్ముక్తామల వృత్త మాక్తిక చయస్సం గ్రామ రంగాంత రే" అనియు వర్ణన లుండుట ; ఇవి మామూలు ప్రశంసలని తో చెడిని. తన పరాక్రమ శక్తిని వినియోగించినవాఁడసి చెప్పుటకుఁ దగిన నిదర్శనములు లేవు. వీని బిరుదము లన్నియు మనకుఁ దెలియును. "సర్వలో కాశ్రయ – శ్రీవిష్ణువర్ధన మహారాజాధిరాజ – రాజవర మేశ్వర - పరమభట్టారక - పరమమాహేశ్వరః -" ఇత్యాదులు. ఇవన్నియును వంశమునకుఁ జెందినవే కాని తనయందు మాత్రము ప్రయుక్తములైనవి యెవ్వియుఁ గానము. క్రొత్తరాజ్యములు సంపాదిం చిన వాఁడైనచో, దానిని సూచించెడు విశేష బిరుదములను దాల్చి యుండును. అది యాచారము. అట్టిది లేనందున, రణ శూరతచేతఁ బ్రసిద్ధికి వచ్చిన వాఁడని జెప్పుటకు సాధ్యము కాదు.
మఱి నందంపూడి మొదలగు శాసనములలోను, భారతము లోను గల వీని వర్ణనములఁబట్టి చూచిన, వర్ణధర్మముల పునరుజ్జీవనము తనయొక్క ముఖ్య వ్యాపార మైనట్లనుమానింపవలసి యున్నది. • రాజ రాజెట్టి మాహాత్మ్యము కలవాఁ డనగా “వివిధాగమవిహిశ్ర శ్ర ముఁడు," “సమస్త వర్ణాశ్రమధర్మరక్షణ మహామహిముఁడు, " " విప్రకులము నెల్లఁ బ్రోచుచు, నగ్ర జన్ములకు ననుగ్రహమున మహాగ్రహారంబు ' లిచ్చువాడు. దీనికిఁ దాత్కారణముగా మనకు దొరకిన వీని ముఖ్య CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri