అధ్యక్షుని వచనము 况 యొక్కయు మతమునందు నిదియ యమృతత్వమని యున్నది. కీర్తి చే శాశ్వతులైన వారిలో రాజరాజొక్కఁడు. సప్తసంతానములలో, ననఁగాఁ బేరును నిలుపు వస్తువులలోఁ, గావ్యము స్థిరతమము. అందును నన్నయభట్టి యొక్క కృతివంటి దాని యమృతత్వమును వర్ణింప సాధ్యమా! ఒక్క చావే కాదు, ముదిమియు లేనిది. నవ్యతయను గుణముచే రామణీయకమును వహించి నిత్యయౌవన మయినది. ఈ కావ్యము తేజస్సు తనయందుఁ బ్రతిఫలించుటఁ జేసి రాజున రేంద్రుని పేరు పూర్ణిమా చంద్రబింబమువలె ఆంధ్ర ప్రపంచమున వెలుఁగుచున్నది. భాషతో గాని యయ్యది య స్తమింపదు. . ఆ చాళుక్యరాజును గుఱించి నేనెక్కువగఁ జెప్పఁదలచుకొన లేదు. నేనయి కనిపెట్టిన నూతనాంశము లెవ్వియును లేవు. ఒరులు చెప్పినది చెప్పుట యీ సభకు మర్యాద కాదు. నందంపూడి శాస నము మొదలగు నాధారములు వల్లఁ దేలు విషయము లివ్వి :- తండ్రి విమలాదిత్యుఁడు; తల్లి చోళ రాజు పుత్రియైన కుండవాంబ; భార్యయుఁ జోళవంశజయ; ఆమె పేరు అమ్మంగదేవి; పట్టాభిషేక దినము ౧౦౨ ౨ వ సంవత్సరము, ఆగష్టు నెల ౧౬ వ తేది; రాజ్య 'మేలిన కాలము ౧౦౬౩ వ సంవత్సరము వఱకు. ఇతనికి బూర్వము వేంగీదేశము చోడుల యధీనములోఁ గొంతకాల, మున్నట్లును, బిమ్మట నరాజక తా బాధితమైనట్లును దెలియవచ్చెడిని. ఆ కాలమున నొక్క రాజ్యతంత్రముల యంద కాదు, సంఘ మతాది ప్రకృతుల యందును గల్లోలములు ప్రబలియుండినవి. విజాతీయులైన శత్రువుల దండయాత్రల వల్ల నేమి, బౌద్ధజైనాది మతముల వ్యాప్తిచే నేమి, వేద తిరస్కార భూయిష్ఠములైన కౌత్సచార్వాకాది వాదములచే నేమి, హిందూమతము యొక్క ప్రాణము లనఁదగిన వర్ణ ధర్మములు కష్టస్థితికి వచ్చినవి. రాజరాజు యొక్క పరిపాలనము బ్రాహ్మణమత CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/19
స్వరూపం