30 ४ వ్యాసమంజరీ మొదటిది. అట్టివారి జన్మస్థానమున నిట్టి పండుగ జరుగుట నిర్హేతు కము కానేరదుకదా! గుణమునుబట్టి చూచిన నగ్రగణ్యు లనఁదగిన వారు ఆంధ్రుల చరిత్ర కర్త లగు చిలుకూరి వీరభద్ర రావుగారు. వీరి వలె నిష్పక్షపాత మైన విమర్శనశ క్తిని బ్రకటించిన వారు మన దేశ మున ననేకులు లేరు. ఆ శక్తికిఁ దగిన శ్రమను దీసికొని యెంత చక్కఁగ, నెంత పూర్ణముగ మన చరిత్రమును సువ్యక్తము చేసి యున్నారో, దానిని దెలుపుటకు నాకు నర్హత చాలదు. వీరితోఁ దుల దూఁXఁ దగిన శోధక శిఖామణులు కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు గారును, జయంతి రామయ్య పంతులుగారును. ఈ సుదినమునఁ గుల దేవతలట్లు కొలువఁదగిన వార లింకను ననేకు లున్నారు గాని, వారి నందఱను బేర్కొని ప్రశంసించుటకుఁ జాలినంత జ్ఞానముగాని, కాలము గాని లేనందున విడువవలసినవాఁడ నైతిని; క్షమింపుడు. రాజరాజ న రేంద్రుని గూర్చియు, నతనికాలమున దివ్య తేజ స్సవ నొప్పియున్న నన్నయభట్టిని గూర్చియు, నీ విద్వత్ శోధకులు శాసనాదిపరీక్షలఁ జేసి, నిర్ధారణచేసిన విషయములు కదా, యీనాఁటి విందు! ఈయుత్సవ మను కృతికి నాయకులు రాజరాజును, నన్నయ్యయు : కృతిక ర్తలు మీ యైతిహాసికమండలివారు. వారి కృతియు, నన్నయయొక్క కృతి వలె నూతన ప్రపంచము నొండు సృష్టికిఁ దెచ్చునుగాక ! " నిత్యమైన ధనము నిర్మలకీర్తియ" అనియు, క. “ఇలఁ గీర్తి యెంత కాలము గలిగి ప్రవర్తిల్లు సంతకాలంబును ని త్యుల కారె కీర్తి గల వు ణ్యులు, కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే ? " " అనియు నన్నయ వ్రాసిన భారత భాగమునఁ జెప్పబడి యున్నది. కీర్తియ యమృతత్వమని వీరి తాత్పర్యము. బౌద్ధుల CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/18
స్వరూపం