Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరాజరాజనరేంద్ర వర్థంతి మహోత్సవము

అధ్యక్షుని వచనము

సభాసదులైన రాజమహేంద్రవర మహాజనులకును, దక్కిన మహాశయులకును, నమస్కృతులు సమర్పించి చేయు విజ్ఞాపనము.

మన మిప్పుడు జరుపు వర్ధంతి హిందూజనులలో నపూర్వ మైనది. పురాణపురుషులఁ బూజించుట మన యాచారములలో నొక్కటియైనను, జారిత్రకపాత్రల స్మరించుట కాదు. కావున నేఁటి యుత్సవ మపూర్వమైన యాచార పరిణామము. సత్యములైన చరి త్రాంశముల జ్ఞ ప్తికిఁ దెచ్చి వ్యాపింపఁ జేయునట్టి మహోత్సవములఁ జేయుటలో మీరు మొదటివారు. మీరు చూపిన మార్గము నెల్లరు ననుసరింతురుగాక ! కేవలపరార్థములైన పండుగలఁ జేయునట్లు మన మేల ఐహిక శ్రేయోనిమి త్తము లైనవానిని జేయమో తెలియకున్నది. మనయందుఁ జరిత్రజ్ఞానాసక్తి కి లేదనుట కిదియు నొక నిదర్శనమా? ఇకముం దైన నీలోపము నివారిత మగునుగాక!


ఈ యపూర్వవర్థంతిసమయమున న న్న గ్రాసనస్థుని జేసి సత్కరించినందులకు మీకు మనఃపూర్వకముగ వందనములఁ జేయు చున్నాను. " చెట్టు పెట్టి పెంచినవాఁ డొకఁడు: దాని ఫలము ననుభ వించినవాఁడు వేతొకఁడు. " అన్న ట్లున్నది. ఇప్పుడు మనకు నాశ్రయ మైన యితిహాసవృక్షమును బెట్టి పోషించిన వారిలో నే నొక్కఁడను గాను. మఱియెవ్వరు ప్రముఖు లనినఁ బ్రథములు — అనఁగాఁ గాలక్రమముగాఁ బరిగణించినచో — కందుకూరి వీరేశలింగముగారు. వారి కవుల చరిత్ర యితిహాసశోధనలకు దారిచూపిన యుద్యమములలో