అధ్యక్షుని వచనము శాసనము లన్నియు బ్రాహ్మణదాన శాసనములే. మఱియు నందం పూడి శాసనములో " నిజవవిత్ర చరిత్ర తోయైః ప్రళయంతి కలి కాల కళంకపంక, " మనియు, భారతములోను, నారీతినె "కలికాలజ దోషతుషార సఁహతిన్ | దన యుదయ ప్రభావమున దవ్వుగఁజోపి అనియు నొక్కి వక్కాణింపఁబడి యున్నది. ఆదిరాజనిభుఁడు, " “ ఆది క్షత్రి చరిత్ర " " " కలియుగ పవిత్ర " ఇత్యాది విశేషణములును ఆ యర్థమ సూచించుచున్నవి. కలియుగ మనఁగా, బ్రాహ్మణ తిర స్కారము, శూద్రవిజృంభణము ఇత్యాది వర్ణధర్మ భంగములు గల కాలము కాని, వేఱు కాదని చరిత్ర వేదులకుఁ జెప్పవలయునా? కలికాలముయొక్క పాపములలో నిదియ ప్రధానము. చూడుఁడు, ఆరణ్యపర్వములోఁ గలియుగ ధర్మవర్ణనము (ఇక్కడ ధర్మ మనఁగా స్వభావము కాఁబోలు.) " వైరమున న శేషవర్ణులు నన్యోన్య పీడ సేయుచును విభిన్న బుద్ధి నొక్కఁ డొకని మేరనుండక వర్ణ సం కరము నేయఁగలరు కలియుగమున, " మఱియు, " ద్రవిడాభీర తురుష్క బర్బర పుళింద వ్యా ప్తిదుష్ట " మగునఁట.. క్షత్రియులు యులు నశింతురు. బ్రాహ్మణులు వాణిజ్యము, వ్యవసాయముఁ జేతురు. చాలీచాల నందులకు " హేతు ప్రత్యయవాద వి | చేతను లై వేదనింద " బ్రాహ్మణులే చేయుదురు. (వేదములఁ దిరస్కరించుట గోపద బ్రాహ్మణమునుండి వచ్చెడు సనాతనధర్మమే కాని నూతన సంస్కారము కాదు.) పురాణేతిహాసములలో వెద చల్ల ఁబడియుండు కలియుగ ప్రశంస చూచినయెడల నీ నిర్వచనము సప్రమాణ మని యొప్పుకొనక తప్పదు. విజాతీయదండయాత్రలు, బౌద్ధాదిమతములు, నిరీశ్వరవాదములైన సాంఖ్యాదిదర్శనములు, 'వేదముల ప్రమాణము 2 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/21
స్వరూపం