పుట:VrukshaSastramu.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయును. పచ్చి కొమ్మలను వేళ్ళను నలుగగొట్టి రసముతీసి యారసము కాచిన అడుగున నొకపదార్థము మిగులును. దీనిని నిలువ చేసి ఔషధములో వాడుదురు. కొందరు మహమ్మదీయులకు వేప చెట్లల మీద ప్రాకిన తీగ మంచిదని నమ్మకముకలదు.

దూసరతీగె:- డొంకలమీద పెరుగును. ఇది తిప్పతీగకంటె సన్నముగా నుండును. ఆకులు, అండాకారము. మూడు పెద్ద ఈనెలు గలవు. దీని పండ్ల రసము సిరావలె ఉపయోగించును. వేళ్ళ కషాయము పిప్పళ్ళ రసముతోడను మేక పాల తోడను కలిపి సుఖ వ్వాధుల వలన గలిగిన కీళ్ల నొప్పులు మొదలగు రోగముల కిత్తురు. ఆకులను నీళ్ళలో వేసి రాసిన యెడల నీళ్ళు ఆకు పచ్చనగును. చిక్కగాను నగును. దానిలో పంచదార వేసి సంకటమువారల కిత్తురు. ఆకులతో గూర చేసి తిన్నచో వారికి మంచిదె.

మానుపసుపు:- పెద్ద తీగె. దీనియాకులు హృదయాకారము దానిమీద 5...7 ఈనెలుండును. కొమ్మలను చిన్న చిన్నముక్కలుగజేసి నీళ్ళలోవేసి నానవేసి నానినిదిని నీరు త్రాగుచో గడుపునొప్పియు కొన్నిజ్వరములును తగ్గును. ఈ గీతె గగెట్టిగా నుండుటచే నొక్కొక్కప్పుడు త్రాడుబదులు దీనినేఉపయోగించుచుందురు.